వరంగల్ నగరంలోని బడా హోటల్స్, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. సుమారు 40కి పైగా షాపులలో శాంపిల్ సేకరణ జరిపారు. 8 షాప్స్ కి నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామని, స్వీట్ షాప్స్, బేకరీలు, హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తనిఖీ చేసారు, ఈ తనిఖీలలో 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. రత్న హోటల్, అశోక హోటల్, హరిత హోటల్, సుప్రభా హోటల్, రంగు బార్, ధనశ్రీ డ్రై ఫ్రూట్స్, వినాయక కిరాణం, రాం నివాస్ స్వీట్స్ హౌస్, హిరా లాల్, స్వీట్స్ హౌస్, సెయింట్ మేరీస్, బెంగళూరు బేకరీ, త్రీ స్టార్ బేకరీ, హంస బేకరీ లను తనిఖీలు చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.