తీవ్ర ఉత్కంఠగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తెల్లవారు జామున ఫలితాలను అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటినుంచి వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి ముందంజలో కనిపించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి చాలా బలమైన పోటీ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడవ స్థానానికి పరిమితమయ్యారు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి సగం కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి మెజారిటీ వచ్చింది. సుమారు 450ఓట్ల వరకు రామచంద్రారెడ్డి ఆదిక్యం లో ఉన్నారు.
Also Read : Ram Charan: ఇండియా తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్… సాయంత్రం మోదీతో మీటింగ్
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనను విజయం సాధించినట్లు ప్రకటించనున్న నేపథ్యంలో వంటేరు శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది చివరకు మూడవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ ఓట్ల లెక్కింపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది చివరకు 169 ఓట్లతో వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఫలితం వెలువడింది. అప్పటికే భారీగా వేచి ఉన్న అభిమానులు మద్దతుదారులు ఆయనకు పూలమాలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారన్నది కేవలం అసత్యం మాత్రమేనని ఇది తన విజయం ద్వారా నిరూపితమైందన్నారు. కచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. సిట్టింగ్ పిడిఎఫ్ అభ్యర్థి కత్తినరసింహారెడ్డి మూడో స్థానంలో నిలిచాడు.మరో వ్తెపు పెద్ద మొత్తంలో నగదు పంపిణీతో పాటు ప్త్రెవేట్ టీచర్స్ ను ఓటర్లు చేర్పించడం వల్లే రామచంద్రారెడ్డి గెలుపుసాధించారని పిడిఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : RRR: జగజ్జేత ఇండియాకి తిరిగొచ్చాడు…