Falcon Scam: హైదరాబాద్‌లో మరో భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. వేల మంది నుంచి పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ఈ స్కాం మొత్తాన్ని 792 కోట్ల రూపాయలుగా గుర్తించిన ఈడీ, ఇప్పటికే 18 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది.
The Raja Saab: ఓ వైపు వాయిదా, మరోవైపు పోరాటం.. మారుతి ఏం చేస్తారో!
ఈడీ ప్రకారం, ఫాల్కన్ గ్రూప్ అనే సంస్థ, మొబైల్ యాప్ ఆధారంగా ప్రజలను ఆకట్టుకుని, “పెట్టుబడులను గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్‌లో వేస్తున్నాం” అంటూ ప్రచారం చేసింది. భారీ లాభాల ఆశ చూపిస్తూ రెండు వేల కోట్ల రూపాయలకుపైగా ప్రజల నుంచి వసూలు చేసింది.
హైదరాబాద్‌తో పాటు కోల్‌కతాలోనూ ఈ సంస్థ ఆస్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికే ప్రైవేట్ జెట్ సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాం వెనుక ప్రధాన నిందితుడు అమర్దీప్, స్కాం బయటపడగానే ప్రైవేట్ జెట్ ద్వారా దుబాయ్‌కు పారిపోయినట్టు సమాచారం.
ఈ స్కాంలో భాగస్వాములుగా వ్యవహరించిన ఇతర వ్యక్తులపై కూడా ఈడీ విచారణ చేపట్టింది. బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో విచారణ వేగవంతం చేశారు.
Box Office War: బాక్సాఫీస్ వార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. రెండు సినిమాల్లో ఏది పేలుతుందో!