జగిత్యాల జిల్లాలో ఏంకగా ముగ్గురు ఎమ్మార్వో లకు ఎసిబి అధికారులమంటూ కొందరు వ్యక్తులు కాల్ చేశారు. దీంతో ఖంగుతిన్న అధికారులు పోలీలకు వివరాలు తెలిపారు. వారు రాయల సీమ యాసలో మాట్లాడారని, బెందిరించారని ఎమ్మార్వోలు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ కాల్ గురించి ఆరా తీసారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే పనిలో నిమగ్నమయ్యారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి నాయక్ రంగంలోకి దిగి ఫోన్ కాల్స్ పై ఆరా తీశారు. ఈ బెదిరింపు కాల్ బెంగళూర్ నుంచి వచ్చిందని నిర్ధారించారు. జగిత్యాలలో కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు. ఇవాళ సాయంత్రం జగిత్యాల జిల్లా తాశీల్దార్ లతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇటీవలె 2022 ఏప్రిల్ 13న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్‌ను అధికారులు నిలిపివేశారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. బాంబు బెదిరింపు కాల్‌తో ట్రైన్ లో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇక 2021 ఆగస్టు 7న వాణిజ్య రాజధాని ముంబైలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ముంబైలోని మూడు ప్రముఖ రైల్వే స్టేషన్లలతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద బాంబులు అమర్చినట్టు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. రైల్వే స్టేషన్లతో పాటు బిగ్‌బీ నివాసంవద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ముమ్మర తనిఖీల అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫేక్ కాల్ తో బెంబేలెత్తిస్తున్న వారితో ప్రజలు హడెలెత్తి పోతున్నారు. ఒక చోటు బాంబు పెట్టామంటూ.. మరో చోట ఇంటిలో బాంబు పేల్చుతామంటూ.. ప్రేమ వ్యవహారాలపై, పెళ్ళిళ్ళ పై ఇలా అనేక రకాలుగా ఫేక్ కాల్స్ వస్తుండటంతో అధికారులు దీనిని నివారించేందుకు నిమగ్నమయ్యారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ కి చెక్ పడినట్టేనా?