Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేయండి.. ఎన్నికలు జరపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు. 2024 ఏప్రిల్-మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రాలకు కూడా ఎన్నికల జరపాలని అన్నారు.మరో తొమ్మిది నెలలలో ఎన్నికలు జరుగుతుండగా.. అకస్మాత్తుగా జమిలి ఎన్నికల గురించి హడావిడి చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో సంస్కరణల పట్ల నిజాయితీతో మీరు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారా? అని ప్రధాని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీ ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరో డ్రామా ఆడే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి సందేహాలు దేశ ప్రజలందరికీ కలుగుతున్నాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ అలాంటి దేశాన్ని ఒకే దేశం ఒకే పన్ను – ఒకే దేశం ఒకే రేషన్.. ఇప్పుడు ప్రస్తుతం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మీ నిరంకుశ వ్యవస్థలో మాదిరిగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
Read also: Salaar : డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టిన ప్రభాస్
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
ఎన్నికల విషయం అట్లా ఉంచితే అంతకన్నా అత్యవసరమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేయడం గురించి మీరు అసలు పట్టించుకోవడం లేదు అని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళుతున్న ఫిరాయింపుదారుల పట్ల లోక్సభ వివిధ రాష్ట్ర అసెంబ్లీల స్పీకర్లు రాజ్యసభ శాసనమండలి చైర్మన్ లకు కాలపరిమితి నిర్ణయించి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి ఎన్నికల నిర్వహణ ఖర్చు అని చెబుతున్న మీకు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుకున్న భారతదేశం సుమారు 45 లక్షల కోట్ల వరకు ఉందని, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎన్నికల నిర్వహణ భారం అని పేర్కొనడం ప్రజాస్వామ్యం పట్ల మీ నిజాయితీని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా మీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం కోల్పోవడంతో మీరు ఇటువంటి గ్రామాలు పాల్పడుతున్నారు అభిప్రాయం కలుగుతుందని విమర్శించారు. మీరు మన రాజకీయ వ్యవస్థను పటిష్ట పరచాలి అనుకుంటే ముందుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని కోరుతున్నట్లు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ICC Rankings: కెరీర్ హై రేటింగ్‌కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..