Salaar : డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టిన ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ”సలార్”. కేజిఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులు గా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.సలార్ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ సినిమా ఫై భారీ అంచనాలు పెంచేసింది.అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం లో సినిమా వాయిదా పడుతుంది అంటూ షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..
సెప్టెంబర్ నెల స్టార్ట్ అయినా కూడా సినిమా నుండి ట్రైలర్ కానీ మరొక అప్డేట్ కానీ చిత్ర యూనిట్ విడుదల చేయలేదు.దీంతో ఈ నెల సలార్ సినిమా విడుదల అవ్వడం లేదు అని తేలిపోయింది.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే రానుందని సమాచారం.. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్లనే వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ వర్క్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.. ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ కూడా డబ్బింగ్ వర్క్ లో పాల్గొని తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడని సమాచారం… ఇక ఈ వర్క్ అంతా పూర్తి అయిన వెంటనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అతి త్వరలోనే సరికొత్త విడుదల తేదిని మేకర్స్ ప్రకటించనున్నారు.అనుకున్న తేదికి విడుదల చేయకపోయిన అదిరిపోయే అవుట్ పుట్ తో సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.
Also Read
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!