Etela Rajender: బీజేపీకి త్వరలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుడ్ బై చెబుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను ఈటల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో రెండు ట్వీట్ లు చేశారు. తను పార్టీలు మార్చే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తన అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో ఒక సైనికుడిలా పని చేస్తున్నానని ఈటల తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమొందిచడమే నా లక్ష్యమని అన్నారు. అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది అని నమ్మినవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురవేయడం కోసం అనుక్షణం అలుపెరగని పోరాటం చేస్తున్నానని అన్నారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై పత్రికల్లో వచ్చిన వార్తను ఖండిస్తున్నానని అన్నారు. తను పార్టీలు మార్చే వ్యక్తిని కాదని, మా అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఐకమత్యం లేకపోవడంతో.. తనను టార్గెట్ చేస్తున్నారని భావించిన రాజేందర్ రేపోమాపో రాజీనామాకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజేందర్‌పై పడటం లేదన్న వాదన ముందు నుంచి ఉంది. నిజానికి ఈటల బీజేపీలో చేరడం బండికి అస్సలు ఇష్టం లేదని కొందరు అంటున్నారు. అయితే వీరిద్దరూ సఖ్యతగా ఉన్నట్టు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. మీడియాలో, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను పార్టీ మారబోతున్నట్లు చాలా రోజులుగా పుకార్లు వస్తున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీకి చెందిన కొందరు నేతలకు ఆయనంటే ఇష్టం లేదంటూ పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సందర్భంగా వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేతలు ఏకమై నిరంతరం శ్రమిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.
I strongly oppose the misleading information that was published today in some newspapers. Telangana's 4 crore people want KCR's dictatorial rule to end. Only the #BJP, led by Hon'ble PM @narendramodi Ji, Hon'ble Party President @JPNadda Ji and Hon'ble Home Minister @AmitShah ji,
— Eatala Rajender (@Eatala_Rajender) May 18, 2023
Deepika Padukone : దీపికా కండిషన్స్ కి బిత్తరపోయిన శింబు… మరో మాట లేకుండానే..