లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC 2025-27 Rankings: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిల్యాండ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టా పగలే చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగగా.. ఆలీ రాబిన్సన్ మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రాబిన్సన్, రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు.
ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో 77.78 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కివీస్, ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వారి పాయింట్ల శాతం 58.33కి తగ్గిపోయింది. దీంతో ప్రస్తుత WTC ఛాంపియన్ సౌతాఫ్రికా, అలాగే శ్రీలంక న్యూజిలాండ్‌ను అధిగమించి ముందంజలో నిలిచాయి. మరోవైపు ఇంగ్లండ్ ఈ విజయంతో ఏడో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ.. తన పాయింట్ల శాతాన్ని 37.88కి మెరుగుపరుచుకుంది. ఈ సైకిల్లో 11 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ నాలుగు విజయాలు, ఆరు ఓటములు, ఒక డ్రాతో కొనసాగుతోంది. ప్రస్తుతం 48.15 పాయింట్ల శాతంతో ఉన్న టీమిండియా ఇంగ్లండ్ మరింత చేరువైంది. WTC ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ ఆరవ స్థానంలో కొనసాగుతుంది. లార్డ్స్‌లో సాధించిన ఈ విజయం ఇంగ్లండ్‌కు సిరీస్‌లో శుభారంభాన్ని అందించగా, న్యూజిలాండ్ మాత్రం WTC రేసులో ఎదరు ఈదాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Patna High Court: "మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం".. హైకోర్టు సంచలన తీర్పు..
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

తాజావార్తలు
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!