కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెరాస లేకుంటే నేను ఎక్కడ అని కొందరు అంటున్నారని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఎమ్యెల్యే గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పుణ్యమా అని ఎమ్యెల్యే గా గెలిచినా అని.. మొదటి సారీ గెలవడం ఈజి.. కానీ రెండవ సారీ గెలవడం కష్టమన్నారు. 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. తరువాత వచ్చే ప్రభుత్వంలో వచ్చే స్కీం చాలా గొప్పగా ఉంటాయన్నారు. రెండున్నర సంవత్సరలుగా రాని పింఛన్ రేషన్ కార్డు లు ఈ రోజు నావల్ల వస్తున్నాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ డబ్బులు రాక.. కాంట్రాక్టర్ ఉరి వేసుకొని చనిపోయాడని.. రాబోయే రోజుల్లో చీకటి కాలానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు అనుభవించామని..ఉద్యమంలో మానుకోటలో రాళ్లు వేసినోడు ఈరోజు నీకు దగ్గరయ్యాడని ఫైర్ అయ్యారు. నా ఆత్మగౌరవం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మ గౌరవమన్నారు.