Ashish Vidyarthi: బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. 57 ఏళ్ళ వయస్సులో తనకంటే చిన్న అమ్మాయిని ఆశిష్ రెండో వివాహం చేసుకున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త రూపాలు బారువాను ఆయన వివాహం చేసుకున్నాడు. ఇక ఆ ఫోటోలు బయటకు వచ్చిన దగ్గరనుంచి ఆశిష్ పై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. 57 ఏళ్ళ వయస్సులో పెళ్లి ఏంటి.. ? ముసలోడుకు దసరా పండుగ.. అంటూ అసభ్యకరమైన మాటలతో ఆశిష్ ను ట్రోలర్స్ ట్రోల్ చేశారు. అయితే ఇప్పటివరకు ఆయన ఈ పెళ్లిపై స్పందించలేదు. అయితే తాజాగా తన రెండో పెళ్లిపై ఆశిష్ స్పందించాడు. తాజాగా రెండో పెళ్లి తరువాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయ తన రెండో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు.
Karate Kalyani: నన్ను చంపడానికి వారు ప్లాన్ చేశారు..
” నా రెండో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ నేను చూసాను. ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. ప్రతి మనిషి మనస్సులో తమకు తాము పెద్దవారిగానే పరిగణిస్తారు. ఇతరులకు కూడా అలాగే సలహాలు ఇస్తారు. అప్పట్లో ఒక వయస్సు వచ్చాక అన్ని ఆపేయాలని చెప్తూ ఉండేవారు. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడు ఏ వయస్సులోనైనా ఏ పని అయినా చేయొచ్చు అని మనకు మనమే చెప్పుకుంటున్నాం. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ?. నేను చట్టాన్ని గౌరవించే మనిషిని. చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నాను.కష్టపడి పనిచేస్తున్నాను.. పన్నులు కూడా కడుతున్నాను. నాకంటూ ఒక వ్యక్తిగత కుటుంబం ఉండాలని కోరుకోవడంలో తప్పేంటీ..? అందుకే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయాన్ని అర్ధం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.