EVM Distribution Center: మెదక్ జిల్లా నారాయణఖేడ్ లోని ఈవీఎం పంపిణీ కేంద్రం వద్ద ఉద్యోగి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్తుండగా టీచర్ జోగు నాయక్ హఠాత్తుగా కిందపడిపోయారు. తోటి ఉద్యోగులు వెంటనే నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. మూర్ఛ రావడంవల్లే కిందపడిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే సిబ్బంది అప్పటి వరకు బాగానే ఉన్నాడని ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో భయాందోళన గురి అయ్యామని తెలిపారు.
Read also: Amma: డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్జే శ్వేత దర్శకత్వంలో “అమ్మ”..
కామారెడ్డి, జహీరాబాద్ లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వాన భారీగా పడతుండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ కోసం ఏర్పాట్లపై అంతరాయం చోటుచేసుకుంది. వర్షానికి టెంట్లో నుంచి నీరు కురుస్తుండటంతో.. పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానతో పాటు ఈదురు గాలులకు టెంటు కూలడంతో.. సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తడవకుండా అవస్థలు పడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి EVM పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. EVM మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షపు నీరు పడుతుండటంతో.. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
Read also: Polling Centers: వేములవాడలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1500 మంది పోలీసులతో పాటు కేంద్రపాలగాలతో భారీ బందోబస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 318 పోలింగ్ ప్రాంతాలుండగా, 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 48 సమస్యాత్మక ప్రాంతాలుగా, 58 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది వెళ్తున్నారు.
Skin Tips: మీ చర్మం మారుతోందా.. కారణం ఇదీ..