కార్తీక మాసం అంటే మాహా శివుడుకు చాలా ప్రీతికరమైన రోజు.. శివయ్య అనుగ్రహం పొందేందుకు ఆయనకు భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. అందుకే భక్తులు దీపాలను వెలిగించి పూజలు చేస్తారు.. కార్తీక మాసంలో నెలరోజులపాటు మాంసాహారాన్ని తినకుండా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు.. ఉదయం చన్నీటి స్నానం చేసి పూజలు చేసి దీపాలను పెడతారు.. ఇలా చేస్తే కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు.. ఇక దీపాలను నీళ్లల్లో దీపాలను వదులుతారు.. అలా ఎందుకు చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కార్తీక మాసంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారు.. అదే దీపాలను నీటి ప్రవాహం ఉన్న దగ్గర దీపాలను వదులుతారు..అలా సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి ఈ పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన నమశివాయ అనే పంచ బీజాక్షరాల నుంచి పంచభూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం.. ఇలా చెయ్యడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని నీటిలో దీపాలను వదులుతారు..
ఇకపోతే ఈ మాసంలో చేసే ఉపవాసాలు, పూజల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. కార్తీకమాసంలో చేసే ఉపవాసం స్నానం, దానం ఎన్నో మంచి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ నెల రోజులు నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం. నెలంతా సాధ్యం కాని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, ఏకాదశి రోజుల్లో అయిన ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు..