Monkeypox: పెరిగిన మంకీపాక్స్ కేసులు.. 59 దేశాలకు పాకిన వైరస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేగంగా వ్యాప్తి చెందుతోన్న మంకీపాక్స్ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతవారం కన్నా ఈ వారం మంకీపాక్స్ కేసులు 77 శాతం పెరిగాయనీ, ఆఫ్రికాలో ఈ వైరస్ సోకి ఇద్దరు చనిపోయారని డబ్ల్యూహెచ్‌వో గురువారం తెలిపింది. ఇప్పటివరకు 59 దేశాలకు పాకిన వైరస్.. 6వేల మందిలో నిర్ధారణ అయ్యింది. జూన్ 27తో పోలిస్తే ఈ వారం అదనంగా 2,614 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని 59 దేశాల్లో మొత్తం 6,027 కేసులు నిర్ధారణ అయ్యాయని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది.
Raj Babbar: ప్రముఖ పొలిటీషియన్, బాలీవుడ్ యాక్టర్ కు రెండేళ్లు జైలు శిక్ష
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
మంకీపాక్స్ కేసులు అత్యధికంగా ఐరోపా, అమెరికా, ఆఫ్రికాలలో కనిపిస్తున్నాయని వివరించింది. ఆఫ్రికాలో చిరకాలంగా ఎలుకలు, చిన్న జంతువులు మనుషులను కరవడం వల్ల మంకీ పాక్స్ వైరస్ సోకుతుంటే, అమెరికా, ఐరోపాలలో స్వలింగ సంపర్కులైన పురుషుల్లో వైరస్ వ్యాపిస్తోంది. అక్కడ మే నెల నుంచి కేసులు కనిపిస్తున్నాయి. ఇంతవరకు 80 శాతం మంకీపాక్స్ కేసులు ఐరోపా దేశాల్లోనే తలెత్తాయనీ, ఇది చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ వెల్లడించారు. ఈ వ్యాధి వ్యాప్తిపై నిఘా వేసిన తమ సంస్థ బృందం ఈ నెల ద్వితీయార్ధంలో సమావేశమవుతుందని చెప్పారు. ఈ వ్యాధి ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!