Tapsee Pannu Getting Ready to Marry her Love Intrest: ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఆసక్తికరంగా హిందీ మొదలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు చెందిన అనేక మంది నటీనటులు పెళ్లిళ్ల బాట పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. ఇక దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం జరుగగా హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరియర్ ప్రారంభించింది. నటన మీద మక్కువతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మొదటి సినిమాగా ఝుమ్మంది నాదం అనే సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా ఆమెకు మాత్రం వరుస అవకాశాలు దక్కాయి. ఇక ఇప్పుడు ఇక్కడ అవకాశాలు కరువవ్వడంతో బాలీవుడ్ వెళ్ళిపోయిన ఆమె అక్కడ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో కూడా భాగమవుతోంది.
Antony Review: కళ్యాణి ప్రియదర్శన్- ఆంటోనీ రివ్యూ
ఇప్పుడు తాజాగా అమ్ముతున్న సమాచారం మేరకు తాప్సీ పన్ను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడనున్నారు. వీరిద్దరూ పదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని ఇటీవల ఆమె అధికారికంగా వెల్లడించింది. అంతకుముందు వీరికి సంబంధించిన ఒక్క వార్త కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్ గా మారిపోయిన ఉదయ్ పూర్ వేదికగా వీరి వివాహం జరుగనుంది. అయితే ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని పూర్తిస్థాయి ప్రైవేట్ ఈవెంట్ గా ఈ వివాహాన్ని వారు చేసుకోబోతున్నారని తెలుస్తోంది. సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం త్వరలోనే జరగనుందని వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వారి వివాహం జరిగినప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.