Yadadri Temple: యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ మళ్లీ కలకలం రేపింది. ఇవాల భద్రాద్రి ఆలయంలో రాములోరి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమారాతో దేవాలయాన్ని ఎలా తీస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్న విషయాన్ని ఆలయ సిబ్బంది పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. డ్రోన్ తో యాదాద్రి ఆలయాన్ని చిత్రీకరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు సాయికిరణ్, జాన్ గా గుర్తించారు. వీరిద్దరూ జీడిమెట్లకు చెందిన వారుగా గుర్తించారు. డ్రోన్ ద్వారా యాదాద్రి ఆలయాన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నరని? ఎవరి అనుమతితో ఇలా చేశారనే దానిపై వీరిద్దరి యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. యువకులను అదుపులో తీసుకోవడంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Read also: Kevin Pietersen : దాని వల్లే విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు..
అయితే గత ఏడాది డిసెంబర్ 22, 2022లో యాదాద్రి ఆలయం వద్ద డ్రోన్ కలకలం రేపిన విషయం తెలిసిందే.. పెద్దగుట్ట నుండి యాదాద్రి ఆలయం సమీప ప్రాంతాల్లో డ్రోన్ తో చిత్రీకరిస్తుండటంతో ఆలయ అధికారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని డ్రోన్ తో ఆలయాన్ని పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. చందు, నిఖిలేష్ అనే వ్యక్తులను అదుపులో తీసుకుని అనుమతి లేకుండా ఎలా చిత్రీకరిస్తు్న్నారని వీరిద్దరి పై కేసునమోదు చేశారు. డ్రోన్ కెమరాను స్వాధీనం చేసుకున్నవిషయం తెలిసిందే.. అయితే ఈ సంఘటన జరిగిన మూడు నెలలకే మళ్లీ ఇవాల యాదాద్రి ఆలయంలో డ్రోన్ కలకలం రేపడం సంచలనంగా మారింది.
Rahul Gandhi: రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. ఏమందంటే?