Dr K Laxman: చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అని డా.లక్ష్మణ్ అన్నారు. సుందరయ్య పార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ధన్యవాదాలు మోడీ పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట Dr లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లు కలిసి మోడీ కటౌట్ కి నిలువెత్తు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 18 వర్గాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కోసం నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞంలో పాల్గొన్నారు. అత్యంత వెనకబడ్డ సంప్రదాయ, హస్త కళాకారులు ప్రధాని విశ్వకర్మ వికాస్ యోజన రేపు మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని అన్నారు. చిన్న కులాల, వృత్తులు వారి కోసం శిక్షణ, పనిముట్లు, లోన్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం పెట్టిన ఘనత మోడీది అన్నారు. 18 రకాల వృత్తులు మీద ఆధారపడిన వారికి ఉపయోగ పడే సంక్షేమ కార్యక్రమం ఇది తెలిపారు. చేతి వృత్తులు ద్వారా సంపద సృష్టించే కొత్త కార్యక్రమం ఇది అన్నారు. దేశ వ్యాప్తంగా రేపు 70 మంది కేంద్ర మంత్రులు వివిధ స్థలాల్లో పాల్గొంటారని వెల్లడించారు. 750 జిల్లా కేంద్రాల్లో రేపు OBC మోర్చా తరపున ధన్యవాదాలు, మోడీ కార్యక్రమం పేరుతో బైక్ ర్యాలీ, పాలాభిషేకం కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు.
రేపు తెలంగాణ విమోచనం కాబట్టి తెలంగాణలో బీజేపీ కార్యాలయంలో మోడీ దీర్ఘాయుష్షు కోసం విశ్వకర్మ యజ్ఞం చేసామని, అన్నీ అసెంబ్లీ కేంద్రాల్లో ర్యాలీలు చేశామని వెల్లడించారు. రేపు అన్ని జిల్లాల్లో obc, బీజేపీ తరపున ప్రత్యక్ష కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలో 30 లక్షల కుటుంబాలకు, తెలంగాణ, ఆంధ్రా లో నాలుగున్నర లక్షల కుటుంబాలకు ఉపయోగ పడుతుందని అన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే కానీ ఇది ప్రజలకోసం చేసి పని అన్నారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే పెంచాల్సింది పోయి.. 22 శాతం తగ్గించి బీసీ లను మోసం చేసిందన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో కొత్త డ్రామా కేసీఆర్ మొదలు పెట్టిండని అన్నారు. కవితమ్మ మీ పార్టీ లో మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ ల స్థానం ఏంటిది? అని ప్రశ్నించారు. కేంద్రంలో 11 మంది మహిళా మంత్రులు, 8 మంది మహిళా గవర్నర్లు ఉన్నారని అన్నారు. ఈ తీర్మానాలను నమ్మి మోసపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఎంబీసీ అన్నావ్ ఏమయ్యింది? 119 లో ఎన్ని బీసీ లకు, ఎన్ని మహిళలకు ఇచ్చావ్ కేసీఆర్ అది చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాయమాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
IAS officer: మహిళా IAS అధికారికి వేధింపులు.. స్వీట్ బాక్స్‌తో డెరెక్టుగా ఇంటికి వెళ్లిన వ్యక్తి