Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి (బుధవారం) నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది చేనేత సంఘాల ఆధ్వర్యంలో రూ.354 కోట్లతో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు. జరీ వివిధ కలర్ కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయమైన చీరలు తయారు చేయబడ్డాయి. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడపిల్లలకు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు బాలబాలికలు అందరూ కొత్త చీరలు కట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల నేత కార్మికులు వీటిని తయారు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన బాలికలకు ఈనెల 4వ తేదీ నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ చేనేత జౌళిశాఖ సన్నాహాలు చేస్తున్నాయి. ఏటా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారు చేశారు. చౌక దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వరంగల్ జిల్లాకు బతుకమ్మ చీరలు చేరుకున్నాయి. 10 రంగులు 25 డిజైన్లు 240 వెరైటీలతో పంపిణీకి బతుకమ్మ చీరలు సిద్దమయ్యాయి. రేపటినుండి ప్రజాప్రతినిధులు సమక్షంలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు మొదలయ్యాయి. మొత్తం 3,43,897 చీరలకు గాను 2,20,000 జిల్లాకు చేరుకున్న చీరలు పంపిణీ చేయనున్నారు.
జరీతో సహా 250 డిజైన్లలో చీరలు
టెక్స్‌టైల్ శాఖ గతంలో కంటే ఎక్కువ డిజైన్లు, రంగులు, వెరైటీల్లో చీరలను తయారు చేసింది. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్లతో 250 డిజైన్లలో చీరలను తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. తమ శాఖ 100 శాతం పాలిస్టర్ ఫిలమెంట్ నూలు చీరలను వివిధ ఆకర్షణీయమైన రంగులు మరియు థ్రెడ్ బార్డర్‌తో తయారు చేసిందని వారు పేర్కొన్నారు. ఆరు మీటర్ల (5.50+1.00) పొడవైన సాధారణ చీరలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్ల పొడవైన చీరలను కూడా తయారు చేశారు.
Railway Services: సిద్దిపేట-కాచిగూడ మధ్య రెండు రైళ్లు..