DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశలో
- రెండో చార్జ్‌షీట్‌కు సిద్ధమవుతున్న పోలీసులు
- మావోయిస్టులకు డీజీపీ కీలక పిలుపు
- పునరావాసంపై వ్యక్తిగత పర్యవేక్షణ హామీ
DGP CV Anand : తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి , మావోయిస్టుల పునరావాస చర్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో వేగం పెంచడమే కాకుండా, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు, త్వరలోనే ఈ కేసులో రెండో చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ , సిట్ (SIT) ఉన్నతాధికారులతో కలిసి మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
- Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
- DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్‌పై కీలక ప్రకటన
- TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
శాంతిభద్రతల అంశాలతో పాటు మావోయిస్టు నేతలను ఉద్దేశించి డీజీపీ ఒక కీలకమైన విన్నపాన్ని చేశారు. అడవిలో ఉన్న నేతలు ఆయుధాలు విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం అత్యుత్తమ పునరావాస పద్ధతులను సిద్ధం చేసిందని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా లొంగిపోయిన వారి జీవన స్థితిగతులను, వారికి ఎదురయ్యే ఇబ్బందులను ప్రతి రెండు నెలలకు ఒకసారి తానే స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని (Personal Supervision) డీజీపీ హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో 1993 నుండే ఈ పునరావాస విధానం అమలులో ఉందని గుర్తు చేస్తూ, దీనిని మరింత పటిష్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!