శ్వేతపత్రం రాష్ట్రాన్ని దివాళా తీయడానికి పెట్టింది కాదని, వాస్తవం ఏంటన్నది ప్రజలకు పూర్తిగా అర్థం కావడానికే అన్నారు డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో భట్టి శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం శ్వేతపత్రంపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం తీసుకువచ్చామన్నారు. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయనేది ప్రజలకు తెలియాలన్నారు.
Also Read: Big Shock: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్..
ప్రజలకు సంపూర్ణంగా వాస్తవం ఏంటన్నది తెలియజేసేందుకే ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టామన్నారు. ‘పేదలు పేదలుగా.. ధనవంతులు.. మరింత ధనవంతులు అవుతున్నారు. ఇదే అసమానతలు పెంచుతోంది. గతంలోనే చెప్పినం..ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు చెప్పారని. ఖర్చుకి.. ఎస్టిమేషన్‌కి పొంతనే లేదు. బీఆర్‌ఎస్ బడ్జెట్ ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. నియోజక వర్గానికి లక్ష ఎకరాల సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? తక్కువ సంపదతో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినప్పుడు.. 2014 నుండి 23 వరకు ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.
Also Read: Karimnagar : కోతి ప్రాణాలను కాపాడబోయి 13 మందిని రిస్క్ లో పెట్టిన డ్రైవర్.. ఇద్దరు మృతి..
ఎన్ని సంపదలు సృష్టించారు? మిరేమైన పరిశ్రమ పెట్టారా? ఏం చేశారు? కాళేశ్వరం.. పాలమూరు రంగారెడ్డి అంతే కదా. ఎన్నికల కంటే ముందు మెడిగడ్డ కూలిపోయింది. ప్రాజెక్టు సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేడిగడ్డ మళ్ళీ కట్టాలి అన్నారు. కట్టిందే ఒక్క ప్రాజెక్టు అదీ కూడా కూలిపోయింది. పాలమూరులో మోటార్లు పెట్టలేదు. ఎల్లంపల్లి కూడా మేము కట్టిందే.. దాన్ని కూడా మీరు వాడుకున్నారు. కాళేశ్వరం లో వాటర్ టాక్స్ వసూలు చేస్తాం అని బ్యాంకులకు చెప్పింది గత ప్రభుత్వం భగీరథకి కూడా అలాగే చెప్పే అప్పులు తెచ్చారు. ఎన్నికల ముందు కాళేశ్వరం పోదామనుకున్న మమ్మల్ని భద్రాచలంలో అరెస్ట్ చేయించారు’ అని భట్టి మండిపడ్డారు.