Delhi BJP leaders: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్ అరెస్ట్‌తో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక ఎంపీని కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సంజయ్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్. బండిసంజయ్ అరెస్ట్‌తో బీజేపీ నేతలు ఢిల్లీ నేతలు ఫోకస్ పెట్టారు. బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా ఫోన్ చేశారు. సంజయ్ అరెస్టుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read also: Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏందని ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అరెస్టు చేసిన పద్ధతి సరికాదని అన్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీడియా రిపోర్టర్ రాజకీయ నాయకులు పంపిస్తే కేసులు నమోదు చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. రిపోర్టర్లు తమ సమాచారాన్ని రాజకీయ నాయకులతో పంచుకుంటారు అందులో తప్పేముంది.. అయితే కేసులు పెడతారా? అని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Read also: Bollywood: ఇదెక్కడి కాంబినేషన్ సామీ… ఎగ్జైట్మెంట్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ?
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానమిచ్చినట్లు సమాచారం. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు కిషన్ రెడ్డి సూచించారు.
Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ