Attack on Student: నల్గొండలో దారుణం.. యువతిపై ప్రమోన్మాది కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Degree college student navya attacked with a knife by a student in nalgonda: డిగ్రీ విద్యార్ధినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇదే కళాశాలలో నల్గొండ కే చెందిన మీసాల రోహిత్ డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. ఇతడితో విద్యార్థికి పరిచయం ఏర్పడటంతో ఇదే అదునుగా గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు తిరస్కరించడంతో.. ఆమెపై కోపం పెంచుకున్న రోహిత్ యువతిపై దాడి చేసేందుకు ప్లాన్ వేసాడు. తన స్నేహితులరాలి ద్వారా విద్యార్థినిని మంగళవారం పట్టణంలోని ఒక పార్కుకు రప్పించాడు.
read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
అప్పటికే తనపై దాడి చేసేందుకు రోహిత్ అక్కడే వున్నాడు. అయితే రోహిత్ ను చూసిన బాధితురాలు కంగారు పడింది. బాధితురాలు వెనక్కు వెళ్దామని ప్రయత్నించగా.. రోహిత్ తనతో మాట్లాడాలని బలవంతం చేయడంతో.. పక్కకు వెళ్లింది. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రోహిత్ తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో విద్యార్థినిపై పదిమార్లు పొడిచి మొఖంపై దాడిచేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కేకలు వేయడంతో.. అక్కడే ఉన్న తాయి, మరో స్నేహితుడు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థతి బాగానే వుందని వైద్యులు తెలిపారు.
అయితే గత కొంత కాలంగా రోహిత్ తన కూతురు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, తను వద్దని ఎంత నిరాకరించిన వినకుండా ఇలా తన కూతురుపై దాడి చేశాడని బాధితురాలి తల్లి దండ్రులు వాపోయారు. తన కూతురిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితున్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతంలో నిందితుడితో బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏ విషయంపై భేదాభిప్రాయాలు వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై తన స్నేహితుడైన సాయికి ముందే తెలుసా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Srilanka Crisis: శ్రీలంకకు కరెంట్ షాక్.. 264 శాతం పెరిగిన కరెంట్ ఛార్జీలు
తాజావార్తలు
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!