Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
- మంచిరేవులలో మెరుపు తనిఖీలు
- 1.931 కిలోల అల్ఫాజోలం స్వాధీనం
- కారు, బైక్‌తో పాటు ఫోన్లు సీజ్
- ఇద్దరు సరఫరాదారులపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్లు తయారీలో అక్రమంగా వినియోగించే ప్రమాదకర మత్తు పదార్థం అల్ఫాజోలం అక్రమ రవాణాపై సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఉక్కుపాదం మోపింది. గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో నిర్వహించిన మెరుపు తనిఖీల్లో భారీగా అల్ఫాజోలంతో పాటు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
దాడుల వివరాలు , అరెస్టులు
మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులకు పెద్ద ఎత్తున అల్ఫాజోలం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగింది. మంచిరేవుల వద్ద జరిపిన తనిఖీల్లో వ్యాగనార్ కారులో 751 గ్రాముల అల్ఫాజోలంతో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను మొదట అదుపులోకి తీసుకున్నారు. అదే ప్రాంతంలో జరిపిన మరొక తనిఖీలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరి వద్ద నుంచి 1.18 కేజీల అల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా అధికారులు ఈ దాడుల్లో 1.931 కేజీల అల్ఫాజోలం, ఒక కారు, ద్విచక్రవాహనం , మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అల్ఫాజోలం , వాహనాల మొత్తం విలువ దాదాపు రూ. 24.18 లక్షలు ఉంటుందని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Also Read
నిందితుల గుర్తింపు , కేసు నమోదు
ఈ కేసులో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన లింగరాజు గౌడ్, టి. ఆంజనేయులు, ఆర్. రమేష్, కాటమయ్యలను అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి అల్ఫాజోలాన్ని సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులైన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న పదార్థాలు , వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గండిపేట ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
అధికారుల హెచ్చరిక , అభినందనలు
ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కల్లు తయారీకి లేదా ఇతర అక్రమ అవసరాలకు అల్ఫాజోలాన్ని తీసుకువచ్చినా, దానితో కల్లు తయారుచేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సూర కృష్ణ, ఎస్సై రమేష్, ట్రైనీ ఎస్సైలు రమణ, రమేష్, గిరి , హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుల్స్ పెంటారెడ్డి, సాయికుమార్, శ్యామ్, శిల్ప, జయలక్ష్మి, శోభలతో కూడిన బృందం అత్యంత సమర్థవంతంగా ఈ తనిఖీలు నిర్వహించి అల్ఫాజోలాన్ని పట్టుకుంది. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ జై హరి కిషన్ ప్రత్యేకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..