నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు భద్రత విధులు నిర్వహించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు వెనక్కి వెళ్లడంతో... ఎస్పీఎఫ్ డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Krishna Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీపై నేడు కేంద్ర జల విద్యుత్ శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జల విద్యుత్ శాఖ అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య హైబ్రిడ్ విధానంలో సమావేశం కానున్నారు.