CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
- మూడు కార్పొరేషన్లకు ఒకే పాలనా విధానం
- 1955 GHMC యాక్ట్ స్థానంలో కొత్త చట్టం
- ప్రాపర్టీ ట్యాక్స్‌లో క్యాపిటల్ వాల్యూ విధానం
- HYDRAకు చట్టబద్ధ అధికారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ నూతనంగా తీసుకువచ్చిన ‘క్యూర్’ (CURE) చట్టం రేపటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. 1955 నాటి జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో రూపుదిద్దుకున్న ఈ కొత్త చట్టం ద్వారా జీహెచ్ఎంసీ (GHMC), సీఎమ్సీ (CMC), ఎమ్ఎమ్సీ (MMC) పరిధులకు ఒకే సమగ్ర పాలనా విధానం రానుంది. విలీన ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న వేర్వేరు పన్నుల విధానాలు, పాలనా వ్యత్యాసాలకు ఈ యాక్ట్‌తో శాశ్వతంగా తెరపడనుంది. మూడు కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల జారీకి సంబంధించి ఒకే రకమైన ఏకీకృత నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
క్యాపిటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్.. ‘ఇంటిగ్రేటెడ్’ బిల్లింగ్
క్యూర్ యాక్ట్ రాకతో నగరంలో ఆస్తిపన్ను విధింపు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న ‘రెంటల్ వాల్యూ’ పద్ధతి స్థానంలో ఇకపై ఆస్తి విలువ (క్యాపిటల్ వాల్యూ) ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ లెక్కించనున్నారు. దీనివల్ల నగరంలో ఆస్తిపన్ను పెరిగే అవకాశం ఉండగా, ఈ పెరిగిన పన్నుల విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానుంది. డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేక ‘ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ కోడ్’ కేటాయించనున్నారు. దీని ద్వారా ఆస్తిపన్ను, డ్రింకింగ్ వాటర్ బిల్లు, సీవరేజ్, శానిటేషన్ చార్జీలన్నింటినీ కలిపి సింగిల్ పోర్టల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ రూపంలో పౌరులకు అందించనున్నారు. అంతేకాకుండా నగరంలో ట్రాఫిక్, విపత్తుల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేయనున్నారు.
Also Read
‘హైడ్రా’కు చట్టబద్ధ హోదా.. ఆక్రమణలపై ఉక్కుపాదం
నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRA)కు క్యూర్ చట్టం ద్వారా పూర్తిస్థాయి చట్టబద్ధ హోదా లభించనుంది. చెరువులు, కుంటలు, నాలాలు , బహిరంగ ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడటంతో పాటు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రాకు ఈ చట్టం ద్వారా అదనపు అధికారాలు కల్పించారు. నగరంలోని పబ్లిక్ అసెట్స్ రక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రా ఇకపై మరింత స్పష్టమైన, పటిష్టమైన చట్టపరమైన అధికారాలతో పనిచేయనుంది.
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?