దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు, 75 మొబైల్ ఫోన్‌లు, మూడు టీవీలు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్ 365, క్రికెట్ మజా, లైవ్ లైన్, లోటస్, బెట్ ఫెయిర్, ఫ్యాన్సీ లైఫ్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల ద్వారా బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అటు బుధవారం నాడు నగరంలోని వనస్థలిపురంలోనూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ రాయుళ్లను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఆర్గనైజర్, ఇద్దరు పంటర్లు సహా మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్, కారు, రెండు బైక్‌లు, రూ. 11.80 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 31,17,576 నగదు ఫ్రీజ్ చేశారు.
https://ntvtelugu.com/food-and-safety-officers-raid-on-bakerys/