గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆయన అన్నారు. మహిళా దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధి వస్సే కలవచ్చని.. వారిచే వినతిపత్రాన్ని తీసుకుని ప్రభుత్వానికి పంపవచ్చాన్నారు. కానీ రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందన్నారు. గవర్నర్ పాత్ర రాజకీయ పరంగా ఉందని.. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మహిళా దర్బార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెరాస ప్రభుత్వంపై విధానపరంగా సీపీఐ పోరాడుతోందని నారాయణ స్పష్టం చేశారు. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని, పబ్‌ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Seethakka: శాంతి భద్రతలు దిగజారుతున్నా.. సీఎం ఫార్మ్ హౌజ్ లోనే
రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం గవర్నర్ తమిళిసై వెల్లడించిన విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మహిళల సమస్యలను గవర్నర్ తమిళిసై తెలుసుకోనున్నారు. దీనిలో పాల్గొనాలనుకునే వారు 040-23310521 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. రాజ్‌భవన్ అధికారిక మెయిల్ ఐడీ rajbhavanhyd@gov.in కు మెయిల్ చేసి కలిసేందుకు అనుమతి తీసుకోవాలని కోరారు.