తెలంగాణలో రాజకీయాలు ప్రజలను రక్షించేలా లేవని.. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రజలను ఎలా బతికించాలనేదే లేదని విమర్శించారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడుకోవడం ఎలా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ మోదీని, మోదీ కేసీఆర్ ని తిట్టుకున్నట్లు నటించారని ఆరోపించారు. ఏపీలో బీజేపీ కులాలకు ప్రయారిటీ ఇస్తోందని.. తెలంగాణలో మతపరమైన అంశాలను రెచ్చగొట్టే…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తలపెట్టిన మహిళా దర్బార్ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని ఆయన అన్నారు. మహిళా దర్బార్ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధి వస్సే కలవచ్చని.. వారిచే వినతిపత్రాన్ని తీసుకుని ప్రభుత్వానికి పంపవచ్చాన్నారు. కానీ రాజకీయ కార్యకలాపాల కోసం రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి ఆజ్యం…