భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు.
Coronavirus : కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కరోనా వచ్చి పోయినవారిలో దీర్ఘకాలికంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలో లక్షలాది మంది ఆ మహమ్మారి బారినపడ్డారు.. కొంతమందిలో లక్షణాలు లేకుండా వైరస్ సోకడం.. తిరిగి కోలుకోవడం కూడా జరిగిపోయాయి.. వైరస్ సోకిందనే భయంతో ఎంతో మంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే, కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్కోవిడ్తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది.. మొత్తం 1,038 మందిపై పరిశోధన నిర్వహించగా.. వారిలో…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు…
కరోనా బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలుపెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కరోనాకు వైద్యం సాయం పొందేలా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నంబరును కేటాయించింది. కరోనాకు టెలీమెడిసిన్ సాయం కావాలనుకునే వారు 8801033323 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ ట్రస్ట్ సూచించింది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవలు అందించించే జూమ్ కాల్…
హుజురాబాద్ ఉపఎన్నికల్లో కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలి అని హుజురాబాద్ కోవిడ్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతా తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ ను సానిటైజ్ చేస్తున్నాం అని చెప్పిన ఆవిడ… 306 పోలింగ్ బూతుల్లో, 306 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షణాలుంటే సెంటర్ వద్దే కరోనా టెస్ట్ చేస్తారు. ప్రతి ఓటర్ మాస్క్ ధరించాలి.. ఓటర్ల మధ్య 6 మీటర్ల దూరం పాటించాలి. దీని పై ఓటర్లను ముందే అవేర్ చేస్తున్నాం అని చెప్పిన…
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు…
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించటానికి సిద్దమైంది. ఇది కోవిడ్ సంబంధిత అన్ని అవసరాలకు ఒక స్టాప్ గా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నిధి తెలిపింది. “నేను ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. దీనిని ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అని పిలుస్తారు. ఇది ప్రజలు వారి అభ్యర్థనలు తెలిపే వెబ్‌సైట్. వారి అభ్యర్థనల మేరకు నేను వారికి ప్రాథమిక…
వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్…