కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం రోజున తెలంగాణలో 3557 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఐసీఎంఆర్ కరోనా చికిత్సా విధానంపై కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. రోజుకు ఐదు సార్లుకు మించి దగ్గు, జ్వరం వంటివి వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలి. ఇంట్లోనే ఉన్నప్పటికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్ తప్పనసరిగా ధరించాలి. అదేవిధంగా నీరు తగినంతగా తీసుకోవాలి. ఐదు రోజులు దాటినా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ తెలియజేసింది.
Read: తాలిబన్ల విన్నపం: మమ్మల్ని గుర్తించండి ప్లీజ్…
నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటే, రక్తంలో ఆక్సీజన్ శాతం 90 నుంచి 93 శాతం మధ్యలో ఉంటే మధ్యస్థ వ్యాధిగా గుర్తించాలి. శ్వాస తీరు ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలని, నిమిషానికి 30 సార్లు కంటే అధికంగా శ్వాస తీసుకుంటే, రక్తంలో ఆక్సీజన్ శాతం 90 శాతం కంటే దిగువకు పడిపోతే తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలని, ఐసీయూలో చేర్చి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.