Komatireddy Venkat Reddy: పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ కమిటీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, కార్యవర్గ చైర్మన్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్, 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 26 జిల్లాలకు కొత్త డిసిసి అధ్యక్షులను, 84 మంది జనరల్ సెక్రటరీలను అధిష్ఠానం నియమించింది. ఈ రెండు కమిటీల్లో పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.
Read also: Ink Attack on Minister: అంబేడ్కర్, పూలేపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిపై సిరా దాడి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాకినట్టే అయ్యింది. ఏఐసీసీ ఇటీవల కొత్త కమిటీని నియమించింది. కొత్త పీసీసీ కమిటీలో చాలా మందికి చోటు దక్కింది కానీ ఏ కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం దక్కకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్. అయితే ఇప్పుడు ఆ స్థానం కూడా దక్కలేదు. ఏఐసీసీ కూడా పలు కమిటీలను ప్రకటించినా ఒక్కదానిలోనూ కోమటిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనికి కారణం ఇటీవల జరిగిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిమునుగోడు ఉపఎన్నిక ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కోమటిరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన చర్చనీయాంశమైంది. పర్యటనకు వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కు మునుగోడులో డబ్బు పంచలేదు కాంగ్రెస్ గెలవదు అనట్లు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాయంలో మళ్లీ ఇంకో ఫోన్ కాల్ సంచళనంగా మారింది. రానున్న రోజుల్లో నేనే పీసీసీ అంటూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ కోమటి రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో గత కొంతకాలంగా నియోజకవర్గం తప్ప మిగతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటి రెడ్డి. అయితే కమిటీ ప్రకటనలో కోమటి రెడ్డి పేరు లేకపోవడంతో చర్చకు దారితీస్తోంది.
Snake Found In Plane: ఎయిరిండియా విమానంలో పాము కలకలం.. విచారణకు ఆదేశం