Shobarani : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఈఓకు వినతిపత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు తెంచుతారని మాట్లాడటం సరికాదని శోభా రాణి హితవు పలికారు. మోడీ దేశ ప్రజలందరికి ప్రధాని కాదా? ముస్లిం మైనారిటీలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మోడీకి తాళిబొట్టు విలువ తెలియదని, దేశం కోసం తాళిబొట్టును వదులుకున్న వ్యక్తి సోనియాగాంధీ అని ఆమె అన్నారు.
అనంతరం కాంగ్రెస్ నేత రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, మోడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని, ప్రజలు కులాలు, మతాలు, వర్గాలుగా విడగొట్టి రెచ్చగొడుతున్నారన్నారు. నరేంద్ర మోడీ, ఆ పార్టీకి చెందిన నాయకులను ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
- Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
- Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
తాజావార్తలు
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్‌లు..!
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
ట్రెండింగ్
-
185Hz డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!