Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరంలో 58 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు మూతపడ్డాయి. ఈ మూసివేతలతో పాటు వివిధ సాంకేతిక విద్యాసంస్థల్లో దాదాపు 950 కి పైగా కోర్సులను కూడా రద్దు చేసినట్లు AICTE అధికారికంగా వెల్లడించింది.
ఈ కళాశాలల మూసివేతకు సంబంధించి AICTE ‘ప్రోగ్రెసివ్ క్లోజర్’ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరం నుండి ఈ విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరం (ఫస్ట్ ఇయర్) విద్యార్థుల అడ్మిషన్లను పూర్తిగా నిలిపివేస్తారు. అయితే.. అప్పటికే ఆయా కళాశాలల్లో చదువుతున్న పాత విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు తమ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా AICTE తగిన అనుమతులు ఇచ్చింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గత కొన్ని సంవత్సరాలుగా ఈ కళాశాలల్లో విద్యార్థుల చేరిక ఆశించిన స్థాయిలో లేకపోవడం, నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యలో అర్హులైన అధ్యాపకులను నియమించలేకపోవడం మరియు మౌలిక వసతుల కల్పనలో విఫలం కావడం వంటి ప్రధాన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యాసంస్థల మూసివేతలో ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలు ఒక్కొక్కటి 12 కళాశాలలతో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 8, తెలంగాణలో 4, పంజాబ్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 3 మరియు రాజస్థాన్‌లో 3 కళాశాలలు మూతపడ్డాయి. గుజరాత్, కర్ణాటక, తమిళనాడులలో రెండేసి చొప్పున, అలాగే హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కళాశాల చొప్పున మూసివేశారు. మొత్తం 58 విద్యాసంస్థల్లో కేవలం 3 మాత్రమే ప్రభుత్వ గుర్తింపు లేదా సహాయం పొందినవి కాగా, మిగిలిన 55 కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాల కింద నడుస్తున్నవే కావడం గమనార్హం. సరైన నాణ్యత మరియు మౌలిక ప్రమాణాలు లేని కళాశాలలు దేశంలో క్రమంగా కనుమరుగవుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!