Congress :రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ సన్నాహాలు
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ సన్నాహాలు
- ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచార లోగో ఆవిష్కరణ
- సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
- సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించి నందుకు : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress : ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఓట్ల చోరీని అరికట్టడం కోసం కాంగ్రెస్ దృఢంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలోనే బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే, ఓట్ల చోరీని నిరోధించేందుకు రాహుల్ గాంధీ ప్రారంభించిన పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఉప రాష్ట్ర పతి అభ్యర్థి గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించి నందుకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ,రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం,పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారన్నారు. రాహుల్ గాంధీ,పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం లో కులగణన చేపట్టామని, బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అంతేకాకుండా..’స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు.. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం.. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం..దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు.. బీసీ లకు మేలు జరగాల్సిందే.. రాహుల్ గాంధీ మాట నిలబడాలి.. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీ లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదు.. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీమ్ కోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం.
రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుంది.. విడిగా సుప్రీం కోర్టు కు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి బాగా సమయం పడుతుంది.. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్ర కు ఈ నెల 26 న హాజరవుతున్న.. బీఆర్ ఎస్ ,బీజేపీ కలిసి యూరియా కొరత పైన డ్రామా లు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీ కే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ అనడం లో నే వాళ్ల తీరు అర్థం అవుతుంది.. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా,అనుప్రియా పటేల్ ను కలిశాను.. యూరియా పంపిణీ పైన శేత్రస్థాయి లో మానిటరింగ్ ను పెంచాలి..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
China: ఓరి దేవుడా! ఆన్లైన్ చెల్లింపు విఫలం.. భర్త వివాహేతర సంబంధం బట్టబయలు..
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!