Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nelson: రజనీకాంత్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ జరుగుతుందో మరోసారి చూపిస్తోంది ‘జైలర్ 2’. థియేటర్లలోకి వచ్చిన ఫస్ట్ షో నుంచే బొమ్మ అదిరిపోయిందనే టాక్‌తో దూసుకుపోతోంది. స్క్రీన్‌పై తలైవర్ ఎంట్రీకి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా, ఆ ఈలలు, గోలలు చూస్తుంటే థియేటర్లు ఊగిపోతున్నాయి. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే రెస్పాన్స్‌పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మనసులోని మాటను పంచుకున్నాడు.
“థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి! తలైవర్ మ్యాజిక్ ఎప్పుడూ మరో లెవల్లోనే ఉంటుంది. ‘జైలర్ 2’పై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు థాంక్యూ. ఆడియన్స్ ఇలా థియేటర్లలో పండుగలా సంబరాలు చేసుకుంటుంటే చూడటం కంటే ఒక డైరెక్టర్‌కు ఇంకేం కావాలి? మీ అందరి సపోర్ట్‌కు చాలా థాంక్స్” అంటూ నెల్సన్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రజినీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ పిక్చర్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.
Also Read
ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ కావడంతో ‘జైలర్ 2’పై ఉన్న భారీ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నెల్సన్ తన మార్క్ యాక్షన్, మాస్ సీన్లతో తెరకెక్కించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అనిరుధ్ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేస్తుండటంతో సినిమా టాక్ నెట్టింట ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ రోజే నుంచే అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో నడుస్తున్న ‘జైలర్ 2’.. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Theatres are going bonkers! 🔥💥 Thalaivar magic hits different❤️ Thank you, dear audience, for the phenomenal love and reception for #Jailer2. Nothing beats seeing the audience celebrate it like this! Thank you all for the love and support🙏❤️
@rajinikanth sir @anirudhofficial @sunpictures— Nelson Dilipkumar (@Nelsondilpkumar) October 18, 2026
తాజావార్తలు
-
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
-
Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్‌పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
-
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!