Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
- నవంబర్ 1న చంద్రుడు, కుజుడి కలయిక
- వృషభ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తి?
- కన్య రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల సూచనలు
- కుంభ రాశి వారికి పోటీలో విజయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై , రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ 1వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్న అంగారకుడు (కుజుడు)తో చంద్రుడు కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన ‘మహాలక్ష్మీ రాజయోగం’ ఏర్పడనుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనసుకు కారకుడైన చంద్రుడు , భౌతిక సుఖాలు, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుల కలయిక కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల ఏయే రాశుల వారి అదృష్టం ప్రకాశించనుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
వృషభ రాశి.. పెండింగ్ పనులు పూర్తి, వ్యాపారంలో భారీ లాభాలు
చంద్ర, కుజుల కలయికతో ఏర్పడుతున్న మహాలక్ష్మీ రాజయోగం వల్ల వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలు లభించనున్నాయి. ఈ రాశి వారికి మూడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుండటం విశేషం. దీనివల్ల వీరిలో ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతాయి. చాలా కాలంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన పనులన్నీ ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో సానుకూల వాతావరణం ఏర్పడి, అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తమ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెడితే ఈ కాలంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు.
Also Read
- Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
- Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
కన్యా రాశి.. ఆర్థిక బలపడకం, ఆస్తి లాభాలు
కన్యా రాశి వారికి నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ రాజయోగం అదృష్ట కవాటాలు తెరుచుకునేలా చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరిగే బలమైన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మరింత బలపడి, పాత బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా ఊహించని ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన లాభాలు చేకూరడంతో పాటు, పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.
కుంభ రాశి.. శత్రువులపై విజయం, కొత్త పరిచయాలు
కుంభ రాశి వారికి ఈ రాజయోగం ఎంతో మేలు చేయనుంది. ఈ రాశి నుంచి ఆరో స్థానంలో చంద్ర, మంగళుల సంయోగం జరగడం వల్ల వీరికి అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో పోటీదారులు , శత్రువులపై సులభంగా విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవారితో కొత్తగా విలువైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగై భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నమ్మకాలు, పండితులు చెప్పిన అంశాల ఆధారంగా ఇవ్వబడినది మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆచరణలో పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!