Congress : రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్ఎస్యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది.
అయితే రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగాం ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారని వారు చెబతున్నారు. అయితే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు.
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!