గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. దళిత అవేదన దీక్ష తర్వాత కలిసిన కాంగ్రెస్ నేతలు.. నిన్న సీఎం తో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అవ్వడం పై మాట్లాడుతూ… దీని పై సోషల్ మీడియా లో తప్పుగా ట్రోల్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం పై జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్యలు సీఎం కి కాకుంటే ఇంకా ఎవరికి చెప్తాం అని అన్నారు. మేము కలిసింది తప్ప పట్టే వాళ్ళు.. ఇన్నాళ్లు ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణ మంత్రులు కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు కదా..? అది కూడా తప్పే కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు తెరాస పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కలవలేదా అని అడిగారు.