కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం గవర్నర్ కి చెప్పాం అని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్రంది అని చెప్పిన ఆయన పంటను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అని అన్నారు.. మెడ మీద కత్తి పెడితే రాష్ట్రాన్ని మోడీకి రసిస్తడా.. కేసీఆర్ అని ప్రశ్నించిన శ్రీధర్ బాబు అదానీ..అంబానీకి రాష్ట్రాన్ని అమ్మేస్తడా అని అడిగారు. రైతును అయోమయంలోకి నెట్టి… తక్కువ ధరకు అమ్మే పరిస్థితి తెచ్చారు కేసీఆర్ అని చెప్పారు. కేంద్రం పై యాసంగి పంట తీసుకోవాల్సిన ధర్మం ఉంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి కొనుగోలు చేయించాలి అని డిమాండ్ చేసిన ఈ మాజీ మంత్రి బీజేపీ. టీఆర్ఎస్ డ్రామాలు వేసి రైతును ఇబ్బంది పెడుతున్నారు అని పెకొన్నారు.