రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. రోశయ్య మరణం మాకు బాధాకరం.. ఆయన మరణం పట్ల మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. ఆయన పదవులకోసం ఏనాడు పాకూలాడలేడు. పార్టీ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తి. నేను,రోశయ్య, గీతారెడ్డి సహచర మంత్రులుగా పనిచేసాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం అని గుర్తుచేసుకున్నారు. ఇక పార్టీ,ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేసాం. ఆర్థిక శాఖలో ఎంతో పట్టున్న వ్యక్తి. ముఖ్యమంత్రి గా గవర్నర్ గా ఎన్నో హోదాలో పనిచేశారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన వ్యక్తి. పరిపాలనదక్షుడు రోశయ్య. ప్రజల వాస్తవ పరిస్థితులను తెలియజేసిన వ్యక్తి ఆయన. ఆయన స్ఫూర్తి తో రాబోయే రోజుల్లో పనిచేస్తాం అని పేర్కొన్నారు.