రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. రోశయ్య మరణం మాకు బాధాకరం.. ఆయన మరణం పట్ల మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. ఆయన పదవులకోసం ఏనాడు పాకూలాడలేడు. పార్టీ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తి. నేను,రోశయ్య, గీతారెడ్డి సహచర మంత్రులుగా పనిచేసాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం అని గుర్తుచేసుకున్నారు. ఇక పార్టీ,ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేసాం. ఆర్థిక శాఖలో ఎంతో పట్టున్న వ్యక్తి. ముఖ్యమంత్రి గా గవర్నర్ గా ఎన్నో…
రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. పీసీసీ, పీఏసీ జాయింట్ సమావేశంలో రైతు సమస్యలపై చర్చించాలని అనుకున్నామని, కానీ రోశయ్య మరణంతో ఆయన మరణం పైనే చర్చించామని షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. రోశయ్య మరణం కాంగ్రెస్ నేతలను కలిచి వేసిందన్నారు.ఈ రోజు సమావేశంలో రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించినట్టు తెలిపారు. రేపు గాంధీ భవన్ లో 11 నుండి 12 వరకు రోశయ్య పార్థివ దేహాన్ని వుంచనున్నట్టు…
మాజీ సీఎంకు రోశయ్యకు నివాళి అర్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రోశయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లో సౌమ్యుడిగా ఉండేవారు. వాడివేడిగా సమావేశం జరుగుతున్న సమయంలో కూడా… నవ్వులు పూయించేలా చమత్కారంగా మాట్లాడేవారు అని గుర్తుచేశారు. సిరిసిల్ల లో నేత కార్మికుల గురించి అడిగితే… వెంటనే స్పందించారు అన్నారు. ఆయన ప్రజాస్వామ్య హితంగా ఉండేవారు అన్ని పేర్కొన కేటీఆర్ రోశయ్య లేరు అనేమాట… బాధాకరం… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అయితే రోశయ్య…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలను తెలుసుకున్నారు. Read Also:…
సినిమాల్లో మాటల మాంత్రికుడు అనగానే అందరికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎలా గుర్తుకువస్తుందో.. రాజకీయాల్లో మాటల మాంత్రికుడు అంటే రోశయ్య పేరు గుర్తుకురాక మానదు. ఎందుకంటే ఆయన చెప్పే సింగిల్ డైలాగ్‌లో ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఆయన మాటలు పరుషంగా లేకపోయినా చాలా అర్థవంతంగా ఉంటాయి. ఎవరైనా రోశయ్యపై ఆరోపణలు చేస్తే.. రోశయ్య సింగిల్ డైలాగుతో సమాధానం చెప్పేస్తారు. దీంతో బడా రాజకీయ నేతలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. అందుకే ఉమ్మడి…
కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మదగిన నాయకుడు. రోశయ్య దివంగత నేత వైఎస్ఆర్‌కు ఆప్తుడిగా మెలిగేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఆయన.. గుంటూరు నగరంలోని హిందూ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989, 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో నర్సరావుపేట నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆర్యవైశ్య కులం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా రోశయ్యకు మంచి పేరు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011…