మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అస్తికత నిమజ్జనం రాజమండ్రి పుష్కరఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు రోశయ్య కుటుంబ సభ్యులు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ నుండి మధురపూడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రోశయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు,…
మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని కిషన్ రెడ్డి అన్నారు. 1980లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తాను రెగ్యులర్‌గా శాసనమండలిలో రోశయ్య ప్రసంగాలు వీక్షించే వాడినని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో కలిసి పనిచేశామని, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేవాళ్లమని, తాము రాజకీయ శతృవులము కాదని, తమకు రాజకీయ వైరుధ్యము మాత్రమే ఉందని తెలిపారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ముందుగా గాంధీభవన్‌కు.. తీసుకెళ్లి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోనున్నాయి. అక్కడి నుంచి కొంపల్లిలోని ఫాంహౌజ్‌కు అంతిమయాత్ర సాగనుంది. తెలుగు రాజకీయాల్లో కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య ఇకలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దాదాపు అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్‌లోనూ మంత్రిగా సేవలందించి.. రికార్డు సృష్టించారు రోశయ్య. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన…
రోశయ్య మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. రోశయ్య మరణం మాకు బాధాకరం.. ఆయన మరణం పట్ల మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. ఆయన పదవులకోసం ఏనాడు పాకూలాడలేడు. పార్టీ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తి. నేను,రోశయ్య, గీతారెడ్డి సహచర మంత్రులుగా పనిచేసాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం అని గుర్తుచేసుకున్నారు. ఇక పార్టీ,ప్రభుత్వ అనేక కార్యక్రమాలు చేసాం. ఆర్థిక శాఖలో ఎంతో పట్టున్న వ్యక్తి. ముఖ్యమంత్రి గా గవర్నర్ గా ఎన్నో…
మాజీ సీఎంకు రోశయ్యకు నివాళి అర్పించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. రోశయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయన రాజకీయాల్లో సౌమ్యుడిగా ఉండేవారు. వాడివేడిగా సమావేశం జరుగుతున్న సమయంలో కూడా… నవ్వులు పూయించేలా చమత్కారంగా మాట్లాడేవారు అని గుర్తుచేశారు. సిరిసిల్ల లో నేత కార్మికుల గురించి అడిగితే… వెంటనే స్పందించారు అన్నారు. ఆయన ప్రజాస్వామ్య హితంగా ఉండేవారు అన్ని పేర్కొన కేటీఆర్ రోశయ్య లేరు అనేమాట… బాధాకరం… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అయితే రోశయ్య…
సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేని మహోన్నత నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా అందరి మెప్పు పొందిన గొప్ప నేత. నేటి తరం నేతలకు ఆయన ఆదర్శప్రాయుడు. ప్రత్యేకమైన ఆయన కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరు. నేటి రాజకీయ నేతల తీరుచూస్తున్నాం… విమర్శలకు తిట్లకు తేడా లేదు. నేతలు కావాలని వివాదాలు సృష్టించుకుంటున్న రోజులు ఇవి. రోశయ్య నిబద్ధత, క్రమశిక్షణ చూసి వారు ఎంతో నేర్చుకోవాల్సి వుంది.…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్…