అందరిలోనూ ఆసక్తి రేపుతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ భారీ కసరత్తు ఫలించింది. ఇవాళ మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపికచేసింది. ఢిల్లీకి రాష్ట్ర పీసీసీ నాలుగు పేర్లు పంపించింది. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేతలు మునుగోడు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే వీరిలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాబట్టి అధిష్టానం ఆమెవైపు ముగ్గు చూపింది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారు చేస్తూ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వారు నలుగురు నేతలున్నా, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి సర్వేలో టాప్‌లో నిలిచారు. అయితే.. పాల్వాయికి వచ్చినంత మేర ఓట్లు చల్లా కృష్ణారెడ్డికి కూడా వచ్చినా, స్రవంతి ముందు ఆయన తేలిపోయినట్లుగా సమాచారం. కాగా.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈనేపథ్యంలోనే.. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించడంతో స్రవంతి స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో.. కోమటిరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఈ పరిణామమే సర్వేలో పాల్వాయి స్రవంతికి కలిసివచ్చినట్లు సమాచారం.
అయితే.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ అభ్యర్థి ఖరారైనట్లే. ఈసందర్భంగా.. కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరిని దించాలా? అని రాష్ట్ర పార్టీ నేతలు సమాలోచనలు చేశారు. అయితే.. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని భావించిన అధిష్టానం.. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో.. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి శ్రవంతిని, మునుగోడు బైపోల్‌లో నిలుపుతున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా ప్రకటనతో అటు బీజేపీ అభ్యర్థి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరూ ఖరారైయ్యారు. ఇక అసలైన అధికార పార్టీ అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. అయితే.. అధికార టీఆర్ఎస్‌లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో గులాబీ దళపతి, సీఎం కే. చంద్రశేఖర్ రావు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో.. మునుపటి ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే టీఆర్ఎస్ క్యాండిడేట్‌గా వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తుండటంతో, అధిష్టానం కాస్త ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ నుంచి మునుగోడు బరిలో ఎవరిని నిలుపుతారో చూడాలి మరి.
CPI Narayana: సంబంధం లేని వాటిలో జోక్యం చేసుకుంటున్నారు.. తెలంగాణ గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలి..!