CM Revanth Reddy: నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం దాన నాగేందర్ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అయితే.. ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కాగా.. మడికొండలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా గర్జన సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ తో కలిసి హెలిపాడ్ సెంటర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
Read also: TS Inter Results 2024: ఇంటర్ ఫలితాల వేగంగా తెలుసుకునేందుకు ఎన్టీవీ డైరెక్ట్ లింక్
సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం సభలో ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ అభ్యర్థులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న సీఎం రేవంత్.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రెండు పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.
TS Inter Results 2024: నేడే ఇంటర్ రిజల్ట్.. ఎన్టీవీ వెబ్ సైట్ లో వేగంగా ఫలితాలు