CM Revanth Reddy : విద్యలో నూతన సంస్కరణలు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
- రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందజేతపై కసరత్తు
- వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి నగరంలో నూతన పాఠశాలలు
- ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిలబస్
- విద్యా శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలన్నారు.
ఒప్పో నుంచి కొత్త పవర్‌హౌస్.. Oppo Pad 5 లాంచ్.. 10050mAh బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లు!
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
విద్యా శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాలు నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాచుపల్లి పాఠశాల స్థలం కేవలం అర ఎకరం మాత్రమే ఉండడంపై సీఎం ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలకు కనీసం ఎకరంన్నర స్థలం ఉండాలని, బాచుపల్లి ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో ఎకరంన్నర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలని సీఎం అన్నారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!