CM Revanth Reddy : కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం
- నాచారంలో బాలమృతం కొత్త ప్లాంట్ ప్రారంభం
- మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
- హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల హామీ
- నాణ్యమైన పౌష్టికాహారంపై సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ఫుడ్స్ పరిధిలో బాలమృతం కొత్త ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాచారంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం మాట్లాడుతూ.. గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తేనే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారనే గొప్ప ఆలోచనతో ఇందిరా గాంధీ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పథకం ప్రారంభమైందని గుర్తుచేశారు. నేడు ఈ బాలమృత ఉత్పత్తి కేంద్రం నాలుగు రాష్ట్రాలకు పౌష్టికాహారాన్ని అందించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. మహిళలను కేవలం వంటింటికే పరిమితం చేయకుండా పరిపాలనలోనూ వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీనివల్ల పనికి వెళ్లే మహిళలకు పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతోందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 11,000 కోట్లు చెల్లించిందని, త్వరలోనే రాబోయే కాలంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు.. అద్దంకి క్వాలిటీ విద్య
హైదరాబాద్‌లో భూమి ధర ప్రస్తుతం బంగారం ధరను దాటి వజ్రాల ధర వైపు దూసుకుపోతోందని, అయినప్పటికీ పేదల కోసం నగరంలో త్వరలోనే ఒక లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, ప్రస్తుతం నర్సరీ నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ఉదయం టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు ఉదయం ఎలాంటి పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తింటారో, ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలు కూడా అలాగే టిఫిన్ చేయాలనే ఆశయంతో విద్యార్థుల చదువుల కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ. 27,000 కోట్లు ఖర్చు పెడుతోందని వివరించారు.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
నాణ్యతలో రాజీ పడొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం
సాధారణంగా రాజకీయ ప్రభుత్వాలు తమకు ఓట్లు వేసిన వారికే పథకాలు ఇస్తాయని, కానీ తాము అలా కాకుండా అర్హులైన విద్యార్థులందరికీ మంచి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు, గర్భిణులకు ఇచ్చే ఫుడ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, అధికారులు సైతం నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గతంలో తాను ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నప్పుడు మీరంతా ఆశించిన స్థాయిలో పని చేయలేకపోయి ఉండవచ్చని.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరందరూ గర్వపడేలా, ఆశించిన స్థాయి కంటే మిన్నగా పని చేసి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి నాచారం నుండి ప్రజా భవన్‌కు బయలుదేరారు.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!