తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రధాని మోడీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించనున్నట్టు సమాచారం.
Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం
కాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానీ మోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై, విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకేళ్లారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై త్వరగా అందేలా మోడీని కోరినట్టు భట్టి తెలిపారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రధానికి వివరించారు.
అలాగే సోనియాతో భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్బంగా ఆయనతో సమావేశం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక అంశాలను చర్చిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై ఆయనతో చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఖర్గేతో సీఎం రేవంత్, భట్టి సమావేశం కొనసాగుతుంది.