CM Revanth Reddy : భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డిలోని జీఆర్ కాలనీని సందర్శించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, తక్షణ సాయం అందించేలా అధికారులను ఆదేశించారు. సీఎం మాట్లాడుతూ, “అప్రమత్తంగా ఉండటం వల్ల ఆస్తినష్టం జరిగినా… ప్రాణనష్టం తగ్గించగలిగాం. వరదలు రాగానే ఇంచార్జ్ మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ఎంపీ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశాను. అయినప్పటికీ మీ సమస్యలను ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వచ్చాను” అని తెలిపారు.
Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు
ప్రజలకు భరోసా ఇస్తూ ఆయన, “పూర్తిస్థాయి వరద నష్టాన్ని అంచనా వేసి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు సహాయం అందించేందుకు పరిశ్రమలతో చర్చించాలని సూచిస్తున్నాను” అని చెప్పారు.
అలాగే, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, పశుసంపదను కోల్పోయిన వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. “కొడంగల్ కు నేను ఎంత సాయం చేస్తానో… కామారెడ్డికి కూడా అంతే సాయం చేస్తా. ధైర్యంగా ఉండండి… ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
Shocking Incident: వీడు మామూలోడు కాదు భయ్యా.. ఏకంగా జడ్జినే బెదిరించాడు..