Revanth Reddy : మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ నగరం నీట మునిగింది. చాలా కాలనీలు నిండా మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు. వరంగల్ లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, రెస్క్యూ, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు తీసుకుంటున్న చర్యలపై కూడా ఆరా తీయనున్నారు. వరంగల్,…
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ వరద ప్రాంతాలను పర్యటించి ఆయన మాట్లాడారు.
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డిలోని జీఆర్ కాలనీని సందర్శించారు.
Minister Nadendla: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. కొల్లిపర మండలం కరకట్ట లంక ప్రాంతాలు, తెనాలి మండలం గోలి డొంక పంట పొలాలను పరిశీలించారు.
HYDRA : నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం పడే అవకాశాలను రెండు గంటల ముందుగానే గ్రహించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో హైడ్రా కమిషనర్ నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. లకడికాపూల్,…
Hyderabad Rains : నగర వ్యాప్తంగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నడుం లోతు వరద ఇళ్లను ముంచెత్తింది. ప్యాట్నీ నాలా పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌లు కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో నిమ…
Ponguletsi Srinivas Reddy : ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తాము చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తూ, బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటే. ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం పాత్ర పోషించడంలో తప్పులేదు. కానీ విమర్శలు చేస్తే వాటికి సోయి ఉండాలి. ప్రజలు అన్నం తినలేదన్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై…
సెప్టెంబర్ నెలలో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా రూ.602 కోట్లు బదిలీ చేశామని...తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించామని…
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి…