CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
- వనస్థలిపురంలో దేవుడి భూముల్ని కూడా కబ్జా పెట్టారు
- ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం
- భూకబ్జాలతో ప్రజలకు సమస్యలు రావద్దనే హైడ్రా తెచ్చాం
- హైడ్రాను ఒక భూతంలా చూపిస్తున్నారు. -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్ లోని గుర్రంగూడ ఎకో పార్క్‌లో మొక్క నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రక్షణ, కబ్జాల నిరోధమే లక్ష్యంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే హైడ్రాను ఒక భూతంలా చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైడ్రా ఎప్పుడూ కూడా పేద ప్రజల జోలికి వెళ్లదని, కేవలం ప్రభుత్వ ఆస్తులను మింగేసే పెద్ద పెద్ద కబ్జాదారుల భరతం పట్టడానికే దీనిని తీసుకొచ్చామని సీఎం స్పష్టం చేశారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. గతంలో ఒక రాజకీయ కుట్ర కారణంగానే తాను కొడంగల్‌లో ఓడిపోయానని, కానీ మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను నిలబెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. చివరకు గుర్రంగూడ ఎకో పార్కును కూడా కబ్జా చేయాలని చూశారని, కానీ తాము పెద్ద పెద్ద లాయర్లను పెట్టి పోరాడి మరి 424 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
దేవుడి భూములను కూడా వదలట్లేదు.!
వనస్థలిపురంలో దేవుడికి చెందిన భూములను సైతం వదలకుండా కబ్జాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే వీపులు సున్నం చేస్తాం” అని ఆయన గట్టిగా హెచ్చరించారు. భూకబ్జాల వల్ల భవిష్యత్తులో సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దించిందని తెలిపారు. నగరానికి గుండెకాయ లాంటి మూసీ నదిని పునరుజ్జీవనం (ప్రక్షాళన) చేద్దామని తాము చూస్తుంటే, కొందరు రాజకీయ స్వార్థం కోసం దానికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌కు కాలుష్య ముప్పు రాకూడదనే..
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాలు విపరీతమైన కాలుష్య కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాయని సీఎం గుర్తుచేశారు. రేపటి రోజున మన హైదరాబాద్ నగరానికి కూడా అలాంటి దారుణమైన పరిస్థితి రాకూడదనే ముందుచూపుతోనే తాము పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని , పచ్చదనాన్ని ప్రోత్సహిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. నగరాన్ని కాలుష్య రహితంగా, సురక్షితంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
-
Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
-
Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!