YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సాయికృష్ణ అదృశ్యం, మరణ ఘటనల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటానికి వైసీపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ కార్యాలయం, పోలీసు కమిషనరేట్ వంటి కీలక వ్యవస్థలు ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు. సాయికృష్ణ తల్లి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోందని పేర్కొన్నారు.
సాయికృష్ణ ఘటన ఒక్కటే కాదని, అదే పోలీస్ స్టేషన్ పరిధిలో క్రాంతి కుమార్ ఆత్మహత్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిందని జగన్ అన్నారు. క్రాంతి కుమార్ తన మరణానికి ముందు విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియోలో పోలీసుల వేధింపుల గురించి ప్రస్తావించాడని పేర్కొన్నారు. సాయికృష్ణ అదృశ్యమైన మే 9వ తేదీ నుంచి అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారని జగన్ చెప్పారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుందని పేర్కొన్నారు.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
సంబంధిత సీఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేసిన జగన్, కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే, ఘటనలో బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులో సీఐతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. పోలీసులపై పోలీసులే విచారణ జరపడం వల్ల పూర్తి నిజాలు వెలుగులోకి రావని, స్వతంత్ర సంస్థతో విచారణ అవసరమని పేర్కొన్నారు. అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. సీఐ నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి పాత్ర ఏమిటి, ఘటనలు ఎలా జరిగాయి, బాధ్యులు ఎవరు అనే విషయాలు సమగ్రంగా బయటపడాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?